తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేవిధంగా చూడాలి అన్నారు. మృతులు, డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓటర్లు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్ని తెలియజేసారు.జులై 14వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున గ్రామం మరియు డివిజన్లలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, క్లస్టర్ ఇంచార్జిలు మరియు తదితరులు పాల్గొన్నారు.