google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తెలంగాణ రాష్ట్రంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన 27వ సబ్-జూనియర్ ఈక్విప్డ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో కాంస్య పతకం సాధించిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన హోంగార్డు జి. భక్త ధ్రువుడు (HG.318) కుమారుడు జి. శక్తీధర్ శ్రీచంద్రను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ కాంస్య పతకం సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో క్రమశిక్షణతో, పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విజయాలు సాధించవచ్చని తెలిపారు. క్రీడలతో పాటు విద్యలో రాణించాలని, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడ ఎంతో అవసరమని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *