google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సెలెక్షన్స్ టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జూలై 10, 11 తేదీల్లోపులివెందుల , కడపజిల్లాలో జరిగే 9వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఫెడరేషన్ పోటీలకు ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా షూటింగ్ బాల్ ఫెడరేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జమ్ములపాలెం పీడీ టి. అశోక్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి తుళ్లిబిల్లి క్రాంతి కుమార్ పాల్గొని ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.
ఎంపికైన క్రీడాకారులు
జూనియర్ షూటింగ్ బాల్ బాయ్స్ విభాగం:మారుతి, అభినవ్ బుద్ద, మీరా, మనోజ్, అఖిల్, లీల మనోహర్, హేమన్ మణికంఠ, అమిర్ కౌశిక్, రిషి, కమల్, రూపేంద్ర, ఆల్బర్ట్, రేమంత్, అక్షిత్.
జూనియర్ షూటింగ్ బాల్ గర్ల్స్ విభాగం:జీవిత, దీపిక, మిస్బా, శరణ్య, కావ్యశ్రీ, అమృత, వర్షిణి, సంగీత, షమిక రాగమయి, మైత్రి, శిరీష, అరణ్య.బాయ్స్ జట్టుకు కోచ్‌గా రాజేష్, గర్ల్స్ జట్టుకు కోచ్‌గా భార్గవి వ్యవహరించనున్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *