google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలో ఉన్నఆల్ఫా మెరైన్ సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్య శాఖ, సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ మరియు సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది కార్మికులు పాల్గొన్నారు. వారికి ఉచితంగా రక్తపోటు , మధుమేహం, హిమోగ్లోబిన్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి అతిధిగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు హాజరై కార్మికులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇటువంటి వైద్య శిబిరాలు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు.ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, ఆర్. సుబాకర్, ఎంపీ హెచ్ ఎ. టీ. పేరయ్య, సి హెచ్ ఓ బి. వెంకట్, ఆల్ఫా మెరైన్ సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ మేనేజర్, ఎం. బుచ్చిబాబు, అసిస్టెంట్ మేనేజర్ పి. మాస్ట్రం, మెటీరియల్ మేనేజర్ తదితరులు విశేషంగా సహకరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *