google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం మరియు ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగంగా మద్యం సేవించేందుకు వినియోగిస్తున్న ప్రదేశాలను గుర్తించి పూర్తిగా శుభ్రపరిచారు. మద్యం సేవకు అనుకూలంగా ఉన్న పొదలు, చెత్తాచెదారం, అనవసర వస్తువులను తొలగించి ఆ ప్రాంతాలను ప్రజలకు సురక్షితంగా మార్చారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *