మైనర్ లకు వాహనాలు ఇస్తే తల్లి దండ్రులు పై చర్యలు తప్పవు
సింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్ హెచ్చరిక.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
నిత్యం ఎక్కడో ఒక చోట మానవ తప్పిదాలతో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ నియంత్రణకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదేశాలతో చర్యలు చేపడుతున్నట్లు సింగరాయకొండ ఎస్సి సుధీర్ కుమార్ పేర్కొన్నారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నుండి ప్రజలలో అవగాహన కల్పిస్తూ వాహనాలు నడిపే మైనర్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వాహనాలు నడిపే మైనర్ల పై చర్యల తోపాటు వారి తల్లి దండ్రుల పై కూడా మోటారు వాహన చట్టం తో ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, ఒంగోలు డీఎస్పీ ఆదేశాలతో సింగరాయకొండ సీఐ పర్యవేక్షణ లో సింగరాయకొండ లో ప్రధాన రోడ్ల తోపాటు ఇతర రోడ్ల పై నిరంతరం తనిఖీలు జరుగు తుంటాయని ప్రజలు గుర్తించి పోలీసు లకు సహకరించాలని ఎస్సై సుధీర్ కుమార్ పిలుపు ఇచ్చారు.