తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం, ఏటీఎంల వద్ద జరిగే చోరీలు, మోసాలు మరియు ఇతర నేరాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో ఏటీఎంలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, భద్రతా సిబ్బంది విధులు, వెలుతురు సౌకర్యం, అత్యవసర భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏవైనా లోపాలు గుర్తించిన చోట వాటిని వెంటనే సరిచేయాలని సంబంధిత బ్యాంకు ప్రతినిధులు, ఏటీఎం నిర్వహణ సంస్థలకు సూచించారు.అదేవిధంగా, ఏటీఎం కార్డు వినియోగదారులు తమ వ్యక్తిగత పిన్‌ను గోప్యంగా ఉంచుకోవాలని, అపరిచితుల సహాయం తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.