తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సాకేత్ గారికి, ప్రణవి హాస్పిటల్స్ డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ ప్రశాంతి గార్లకి, శారదా నర్సింగ్ హోమ్ డాక్టర్ వెంకటేష్, బ్రాహ్మిణి గార్లకి, హరిణి ప్రజా వైద్యశాల డాక్టర్ మల్లికార్జున రావు గారికి, సాయి తేజ హాస్పిటల్ డాక్టర్ ధర్మతేజ గారికి, సునీల్ హార్ట్ కేర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ గారికి, శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ కెవి అశోక్ చౌదరి గారికి, సంకల్ప హాస్పిటల్ డాక్టర్ సురేష్ కుమార్ గారికి, లీలా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ తిరుమలరావు గారికి, న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ ఇంద్రాణి గారు, గవర్నమెంట్ హాస్పిటల్ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ ప్రసాద్ గారికి ధన్యాసి మాలకొండయ్య హాస్పిటల్ వారిని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ నిర్వాహకులు పబ్బిశెట్టి వరదరాజ,పబ్బిశెట్టి పవన్ కుమార్, శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వరదరాజ గారు మాట్లాడుతూ డాక్టర్లు 24/7 ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు వారానికి ఒకరోజు ఓపి ఫ్రీగా చూస్తున్నారు. మానవసేవే మాధవ సేవగా భావిస్తూ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా వీరందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వేముల శ్రీనివాసులు, చీతిరాల గోపాల్,దేసు కోటేశ్వరరావు, ఇడవలపాటి సుబ్రహ్మణ్యం,చీదెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ కూడా మా అందరికీ ఆనందాన్ని వ్యక్తపరిచారు