google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.ఈ క్రమంలో బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి, సీఈఐఆర్ (CEIR) సాంకేతిక వ్యవస్థ సహాయంతో మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం మొబైల్ ఫోన్‌ను అసలు యజమానికి అప్పగించి వారి ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చారు.తమకు ఎంతో విలువైన మొబైల్ ఫోన్‌ను తిరిగి అందించిన బల్లికురవ పోలీసులకు బాధితుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నమ్మకమైన సేవలు అందించడంలో ప్రకాశం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, పోయిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని పోలీసులు తెలిపారు.మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే పోయిన మొబైల్‌ను గుర్తించే అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *