ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అల్లినగరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,580 నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలో జూదం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *