దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనకొండ మండలం జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల భద్రత, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అలాగే బాల్య వివాహాల చట్టపరమైన నిషేధం, వాటి వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై వివరించారు.అదేవిధంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్/గంజాయి) వల్ల కలిగే ఆరోగ్య, విద్యా మరియు సామాజిక నష్టాలు, సైబర్ భద్రత, మంచి అలవాట్లు, బాధ్యతాయుతమైన విద్యార్థి జీవితంపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజంలో చైతన్యవంతులైన, బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *