తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి – గౌతమి శ్వేతల వివాహ రిసెప్షన్ వేడుకల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ, డా. కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని నూతన దంపతులను అభినందించారు.