ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిద్దలూరు మండలం గ్రామాల నుండి మార్కాపురంకు తరలి వెళ్లారు. వివరాల్లోకి వెళితే ఎమ్మార్పీఎస్ స్థాపించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడటంతో జిల్లా హెడ్ క్వార్టర్ నందు నిర్వహించు ర్యాలీకి గిద్దలూరు మండలంలోని గిద్దలూరు ముల్లపాడు, కొమ్మనూరు, నరవ సంజీవరావుపేట, అంబవరం, అంకాలమ్మ పల్లె, కిష్టం శెట్టిపల్లె, నల్లగట్ల దేవనగరం, వెంకటాపురం, పొదలకొండపల్లి, తదితర గ్రామాల నుండి దాదాపుగా 150 మంది ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఇంచార్జ్ దేవ ప్రభాకర్, గిద్దలూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్మునూరు వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పందీటి రజిని కుమార్, చెరుకుపల్లి లక్ష్మయ్య, కోశాధికారి ఇర్మియా ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగ పుట్టినరోజులు పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్న అనంతరం మార్కాపురం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అనేక సామాజిక కార్యక్రమాలు చేశారని ఎమ్మార్పీఎస్ అనేది కేవలం ఒక భాగమేనని అందులో భాగంగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, ఆరోగ్యశ్రీ ఆవిర్భవించడానికి మందకృష్ణ పోరాటమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *