చెరువుకొమ్ము పాలెం గ్రామంలోని సంఘటన స్థలాన్ని సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువుకొమ్ము పాలెం గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల వయసు గల జి.రిచర్డ్ రేయాన్స్ తండ్రి చంద్రశేఖర్ అనే బాలుడు మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో కనిపించకుండా పోయిన ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ గారు సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. బాలుడి ఆచూకీని కనుకొనటానికి ప్రత్యేకంగా 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. బాలుడు వెళ్లి ఉండే అవకాశమున్న ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టడంతో పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించాలని, కొత్త వ్యక్తులు విచారణ, వాహన తనిఖీలు, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని, బాలుడిని చివరిసారిగా చూసిన వ్యక్తులను గుర్తించి వారి నుంచి సమాచారం సేకరించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.అదేవిధంగా, జిల్లా వ్యాప్తంగా మరియు ప్రక్క ఉన్న జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు బాలుడి వివరాలను వెంటనే చేరవేసి, గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, బాలుడి ఆచూకీ కొరకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగించాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, తాలూకా ఎస్సై ఫిరోజ్, సిబ్బంది ఉన్నారు.