అంగన్వాడీల వేతనాలు పెంచాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ,జూలై 10వ తేదీన జరుగు ఒంగోలు కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని బుధవారం నాడు ఉలవపాడు సిడిపిఓ శ్రీమతి మాధవిలత అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఉలవపాడు ప్రాజెక్టు కమిటీ నోటీస్ అందజేసింది.ఆరోజు సెంటర్లు మూసివేసి స్వచ్ఛందంగా ఆందోళనలో పాల్గొంటామని సిడిపిఓ ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సెక్రెటరీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం అంగన్వాడీలను పట్టించుకోలేదని మేము వస్తే వెంటనే మీ జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు జీతాలు పెంచక పోవడం దారుణం. జీతాలు పెంపు కోసం అంటే ఆందోళనలో అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ ఇందిరావతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి. తిరుపతమ్మ, ప్రవీణ,జూపూడి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *