తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మిషన్ యూత్4 – ప్రకాశం పోలీస్ హ్యాకథాన్ 2026* కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. సాధారణంగా మహానగరాల్లో నిర్వహించే హ్యాకథాన్‌ను ప్రకాశం జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని, పోలీసు శాఖతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల కోసం యువత ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, హ్యాకథాన్‌లో సుమారు12 సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే లక్ష్యంతో 45 జట్లు పాల్గొనడం విశేషమని తెలిపారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి యువత ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమం విజయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.హ్యాకథాన్‌లో రూపొందించిన పరిష్కారాలను పోలీసు శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి, పోలీసింగ్‌కు ఆచరణాత్మకంగా ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను గుర్తించి, వాటిని పోలీసు వ్యవస్థలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఆవిష్కర్తలతో సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు.రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సాంకేతికత ఆధారిత పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అదే స్ఫూర్తితో పోలీసు శాఖ కూడా టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.వివిధ కళాశాలలు, రాష్ట్రాల నుంచి వచ్చిన యువత తమ సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో పోలీసింగ్‌కు తోడ్పాటునందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, హ్యాకథాన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.ఈ మిషన్ యూత్4 – ప్రకాశం పోలీస్ హ్యాకథాన్ 2026 నిర్వహణలో SRAVENTIX TECHNOLOGIES LLP సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించగా, ORVION LEARN EDGE LLP ప్రధాన విద్యా మరియు ఇంక్యుబేషన్ భాగస్వామిగా సహకారం అందించింది. యువతలో ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, పోలీసింగ్‌తో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి ఈ రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన యువతకు మార్గదర్శకత్వం, స్టార్టప్ ఇంక్యుబేషన్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించి, వారి ఆవిష్కరణలను ఆచరణలోకి తీసుకురావడానికి అవసరమైన సహకారం అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు తాలూకా ఇన్‌స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఒంగోలు రూరల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, ఒంగోలు ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, SRAVENTIX TECHNOLOGIES LLP మేనేజింగ్ పార్ట్నర్ పెర్ల మహేష్ కుమార్, ORVION LEARN EDGE LLP మేనేజింగ్ పార్ట్నర్ నార్నె వెంకట ఫణీంద్ర సాయినాథ్, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
