తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి, ముండ్లమూరు మండలాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు శ్రీ జి. ఏడుకొండలు గారు, శ్రీ పి. కోటేశ్వరరావు గారు దర్శి టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.