వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్శి నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు ₹22,57,771 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శుక్రవారం సాయంత్రం దర్శి టీడీపీ కార్యాలయంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ..“ఆపదలో ఉన్న ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను” అని తెలిపారు.ప్రజల కష్టాల్లో తోడుగా నిలుస్తూ, అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు గారు, దర్శి, తాళ్లూరు, కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు, మేడగం వెంకటేశ్వర్ రెడ్డి గారు, పిడతల నేమిలయ్య గారు, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్నా గారు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *