బోటుప్రమాదంలో కందుకూరు కుర్రాడు సురక్షితం – వియత్నాం దేశంలో జరిగిన బోటు ప్రమాదంలో కందుకూరుకు చెందిన ఓ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. కందుకూరులోని కీర్తి సెల్ పాయింట్ యజమాని గొల్ల శ్రీనివాస్ కుమారుడు సాయి నవీన్ …3 రోజుల క్రితం వియత్నాం పర్యటనకు వెళ్లాడు. లావా మొబైల్ కంపెనీ, మొత్తం 56 మంది మొబైల్ డీలర్లను విదేశీ పర్యటనకు తీసుకువెళ్లింది. వారిలో సాయి నవీన్ కూడా ఉన్నాడు. డీలర్లను ఒక బోటు ద్వారా సముద్రంలోనికి తీసుకువెళ్లగా, అక్కడ ప్రమాదం జరిగింది. బోటు తిరగబడటంతో 33 మంది చనిపోయారు. సాయి నవీన్ సహా కొంతమందిని కాపాడారు. ప్రస్తుతం సాయి నవీన్ సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *