తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంబాలపాడు ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా త్రాగు ,వాడుకొనీరు విడుదల కాకపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఎన్ని పర్యాయాలు ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలతో ఎస్సీ కాలనీవాసులు రోడ్ ఎక్కి రాస్తారోకో చేశారు…తమకు మంచినీటి సమస్య తీర్చేంతవరకు రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు..సమాచారం అందుకున్న ఎస్సై సూరెడ్డి రాజేష్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామనిఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు….