తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో Sky Eye Prakasam ప్రాజెక్టు ద్వారా డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి అరికట్టేందుకు డ్రోన్‌ల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టారు. ప్రజల శాంతిభద్రతలు, భద్రతను పరిరక్షించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.