google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని ఆనందపురం రోడ్డులో ఉన్న కృప ఆత్మసన్నిధి మినిస్ట్రీస్‌లో జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన చిన్నారుల ప్రత్యేక ప్రార్థన సమావేశం నిర్వహించారు. ఈ ప్రార్థన సమావేశానికి స్థానిక సంఘకాపరి ఆంద్రేయ హాజరై మాట్లాడుతూ, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వుడి; వారిని ఆటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటి వారిదే” అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి చిన్నారి దేవుని భయంతో, మంచి విలువలను అలవర్చుకొని, చదువులో రాణిస్తూ ఆశీర్వదించబడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అనంతరం దాతల సహకారంతో నిరుపేద విద్యార్థులకు నోట్‌బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు ఎలిశమ్మ ఆంద్రేయ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, “విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించి, కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, దేవునియందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడవాలని కోరారు.” ఈ కార్యక్రమంలో ప్రేమ్‌బాబు, నితీష్, తాహీర్, వేణుబాబు, శివ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *