google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో మూడు తరాలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 322 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశాను.రైతు భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి, వారి హక్కులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మన ప్రభుత్వం “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.గతంలో 1-B, అడంగల్ వంటి కీలక భూ రికార్డులు అందుబాటులో లేక రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పారదర్శకంగా రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చాం.రైతుల హక్కుల పరిరక్షణ, భూ రికార్డుల ఆధునికీకరణ, పారదర్శక పాలన కోసం మా ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *