మండలంలోని కనుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని మలినేని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కు చెందిన మలినేని లక్ష్మయ్య వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి వెలిది శ్రీ మారుతి ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పారా ఒలంపిక్స్ వేదిక హిల్ పారడైస్ స్కూల్ ఆగిరిపల్లి ఏలూరు నందు 20 జూలై 2026 నుండి 22 జూలై 2026 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా ఒలంపిక్స్ ఛాంపియన్ ఆటల పోటీల నందు షార్ట్ పుట్ విభాగం లో బంగారు పతకము 100 మీటర్స్ మరియు 400 మీటర్స్ నందు సిల్వర్ పతాకము కైవసము చేసుకొనెను ఈ సందర్భముగా కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్ళు గారు మాట్లాడుతూ తమ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పారా విలంపిక్స్ నందు ఈ ఘనత సాధించడం ఎంతో గర్వకారణం అని తెలిపారు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న మలినేని విద్యాసంస్థల దృక్పథానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షాలోమ్ పిడి వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొని ప్రసన్న కుమార్ ను అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *