ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ‘స్కై ఐ ప్రకాశం (Sky Eye Prakasam)’ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అక్రమ జూదం నిర్వహించడం, పేకాట ఆడడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. గ్రామ శివారులు, వ్యవసాయ పొలాలు, ఖాళీ ప్రదేశాలు, చెట్ల తోటలు మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాలను ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వెంటనే సమాచారం అందిస్తున్నారు.డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యంగా ఉంది.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం నిర్వహించడం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇటువంటి ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *