మార్కాపురం జిల్లా గిద్దలూరు లోని తిరుమల కన్వెన్షన్ హాల్ లో సీ G R F వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు.ఈ విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఫార్మర్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మరియు CGRF చైర్మన్ ఎన్. విక్టర్ ఇమాన్యూల్ అధ్యకతన జరిగింది.
గిద్దలూరు సర్కిల్ లోని విద్యుత్ వినియోగదారుల నుండి సుమారు 30 మంది అర్జీల ద్వారా తమ సమస్యలను CGRF చైర్మన్ దృష్టికి తేవడం జరిగింది. విద్యుత్ చట్టాల ద్వారా వారి సమస్యలను పరిష్కరించినట్టు cgrf చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్, అధిక లోడ్, అధిక కరెంటు బిల్లు సమస్యలు ప్రధానంగా ఉన్నట్టు వాటిఫై చట్టరీత్యా పరిష్కారం జరిపామని Cgrf చైర్మన్ తెలిపారు.అలాగే ఎవరైనా విద్యుత్ సమస్య లపై సమస్య వచ్చిన రెండు సంవత్సరాల లోనే CGRF ను సంప్రదించి సమస్యలను పరిష్కరించు కోవచ్చని విద్యుత్ వినియోగదారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *