తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జలజీవన్ మిషన్ లో భాగంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరు, పురోగతిని బుధవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఏ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం అందబోతుంది, ప్రస్తుత పనుల తీరు వంటి విషయాలను అధికారులు మ్యాప్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు. ఈ ప్రాంత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గడువులోపు కచ్చితంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎల్ బి ఎస్ నగర్ లో జరుగుతున్న పైపు లైన్ పనులు సైతం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బీవి. నాగేశ్వరరావు, ఈఈ సురేష్ బాబు, డీఈ శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఏఈ లు, ఇతర ప్రాజెక్టు సంబంధించిన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.