తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు మండలంలోని ముండ్లమూరి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముండ్లమూరి వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు ముండ్లమూరి వెంకటేశ్వర్లు, ముండ్లమూరి రమణయ్య రూ 45000/-లు విలువైన మంచినీటి ఆర్వో ప్లాంటును బహూకరించారు. ఈ ఆర్ ఓ ప్లాంట్ ద్వారా కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచినీటి వసతి లభిస్తుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు రమణయ్య సోదరులు మాట్లాడుతూ తాము విద్యనభ్యసించిన పాఠశాలకు తమ తండ్రి జ్ఞాపకార్థం ఆర్ ఓ ప్లాంటును బహూకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎన్ శివరామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారికి ధన్యవాదాలు తెలిపారు.