తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థల బంద్ జరిగింది. ఉదయం ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు అన్ని విద్యాసంస్థలు మూయించటం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు రాగి రామ్మోహన్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ సందర్భంగా విద్యార్థులు జూలై 20వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్ నుండి చలో పార్లమెంట్ కార్యక్రమం పిలుపునివ్వటం జరిగిందని అందులో భాగంగా పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ, అదేవిధంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ నిర్వహించాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా కందుకూరు లో కూడా బంధు నిర్వహించారని వారు అన్నారు. అనంతరం పట్టణంలోని అనేక విద్యాసంస్థలను మూయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు గెట్టినపల్లి లలితేష్, ఏఐవైఎఫ్ కార్యదర్శి బి చంద్రమోహన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు బి తేజ, విద్యార్థినీ విద్యార్థులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.