కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ 4.0… గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం ZP హైస్కూల్ లో శుక్రవారం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, నేతల సందడితో కోలాహలంగా సాగింది. గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ లాగా మేము మాట తప్పలేదు. ప్రతిఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే, అంతమందికి తల్లికి వందనం ద్వారా 15వేలు ఇచ్చాం. నియోజకవర్గంలో 31,330 మంది పాఠశాల విద్యార్థులకు 40.72 కోట్ల రూపాయలు, 4,149 మంది కాలేజీ విద్యార్థులకు 5.39 కోట్ల రూపాయలు… మొత్తంగా 35,479 మంది విద్యార్థులకు 46 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. నారా లోకేష్ గారి కృషితో ప్రభుత్వ పాఠశాల్లో మార్పులు వచ్చాయి. డీఎస్సీ ద్వారా ప్రతిభ కలిగిన టీచర్లు వచ్చారు. వసతులన్నీ చక్కగా ఏర్పాటయ్యాయి. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డను విద్యాధికురాలిని చేయాలి… అని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కేవలం బటన్ నొక్కిన ప్రభుత్వానికి, హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వానికి తేడా గుర్తించండి. మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి… అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పిల్లల్లో విద్యా ప్రమాణాలు, పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి…మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు…
వచ్చే ఏడాది నాటికి హైస్కూల్ కు గ్రౌండ్ మరియు 6 తరగతి గదులు ఏర్పాటు చేస్తాను.
గ్రామ సమీపంలో ఎలికేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కావలికి తారురోడ్డు సౌకర్యం కల్పిస్తాను. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గారు… విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని, భోజనం చేశారు. స్కూలు ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా బాధ్యత తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ రవి, ఎంఈఓ లు గోవర్ధన్, హరిరామ్ , ఎంపీడీవో మల్లికార్జునరావు, మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు గిరిబాబు, గ్రామ టిడిపి అధ్యక్షుడు గుండ్లపల్లి సుబ్బారావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండ్లపల్లి శివాజీ, గ్రామ నాయకులు బొజ్జా వేణు, మద్దసాని కృష్ణ, గుండ్లపల్లి వెంకట శివాజీ, బ్రహ్మయ్య, అక్కిలగుంట ఒరయ్య, ప్రకాశం, ఆశీర్వాదం, క్లస్టర్ ఇన్చార్జులు చిత్తారు మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, మండలంలోని అన్ని గ్రామాల టిడిపి అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *