తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గత మార్చి లో జరిగిన పదవ తరగతి పరీక్షలలో 587 మార్కులతో మొదటి స్థానం పొంది ఐఐఐటీ నూజివీడు లో ప్రవేశం సాధించిన బీగాల నాగజ్యోత్స్న అనే విద్యార్థినికి సింగరాయకొండ మండలం కలికవాయ కు చెందిన మందలపు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మందలపు సుమతి విద్యార్థినిని అభినందించి 10,000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే.మహాలక్ష్మి మాట్లాడుతూ సుమతి చేసిన సహాయం ఆ విద్యార్థినికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విధంగా సహాయం చేయడం ద్వారా ఆర్ధికంగా ఇబ్బంది పడే విద్యార్థులు చదువుకు ఇబ్బంది లేకుండా చదువుకోగలుగుతారని అన్నారు. విద్యార్థినికి సహాయం చేసిన ఎం.సుమతి కి విద్యార్థిని తల్లి తండ్రులు, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.