తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు లోని గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో 2026 – 2027 విద్యా సంవత్సరానికి గాను ” పదవి స్వీకార వేడుక ” ( INVESTITURE CEREMONY ) చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ,డిప్యూటీ హెడ్ బాయ్ ,డిప్యూటీ హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్, హౌస్ వైస్ కెప్టెన్, స్పోర్ట్స్ కెప్టెన్ , స్పోర్ట్స్ వైస్ కెప్టెన్, C.C.A కెప్టెన్ , డిప్యూటీ C.C.A కెప్టెన్ , హౌస్ గ్రాండ్ మాస్టర్స్ మరియు డిప్యూటీ హౌస్ గ్రాండ్ మాస్టర్స్ గా ఎన్నికైన వారిని ముఖ్యఅతిథిగా వచ్చిన కందుకూరు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారైన బండ్ల భార్గవ్ గారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండ్ల భార్గవ్ గారు మాట్లాడుతూ, ఎవరైతే పదవిని స్వీకరించారు వారు తమ కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తించాలని కోరారు, చిన్నప్పటి నుంచే మీకు ఓటు హక్కు గురించి తెలుసుకునే అవకాశాన్ని మీ స్కూలు యాజమాన్యం మీకు కల్పించారు. చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి నాయకులు అవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ గారైన బండ్ల భార్గవ్ గారు కోరారు. అనంతరం చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లల్లో చిన్నప్పటి నుండే నాయకత్వపు లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము మా పాఠశాలలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించి తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించారు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటు విలువ, నాయకత్వపు లక్షణాలు, సమాజంలో మంచి నాయకుడి యొక్క ఆవశ్యకత, మరియు నాయకుడికి సమాజం మీద ఉండవలసిన బాధ్యత గురించి చైర్మన్ గారు చక్కగా వివరించారు. అనంతరం పదవిని చేపట్టిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ సందేశం ద్వారా మంచి స్ఫూర్తిని పొందారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరి, వైస్ ప్రిన్సిపల్ శోభారాణి , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.