ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో నైట్ బీట్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు.
ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను ముందస్తుగా నివారించడం మరియు శాంతిభద్రతలను కాపాడడమే ఈ ప్రత్యేక నైట్ బీట్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *