ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకూరు గ్రామ పొలాల్లో ఎస్‌ఐ మరియు పోలీసు సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 04 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 02 కోడిపుంజులు మరియు రూ.2,360/- నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.జిల్లాలో చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ కోడిపందేలు, జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112 ద్వారా సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *