మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. శనివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం ఐ.ఓ.సి సమీపంలోని దామచర్ల సత్య కార్యాలయంలో కొండపి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారుల అభిప్రాయాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్రచార వివరాలను మై టీడీపీ యాప్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధముగా రెండేళ్లలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. కొండపి నియోజకవర్గంలోనే ఈ రెండేళ్లలో రూ. 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినట్టు మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి వంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. త్వరలోనే పింఛన్లు, నూతన గృహాలు మంజూరు చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గానికి చెందిన మండల, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.