తొలి శుభోదయం న్యూస్ :-
జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి మరియు పలు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు, యాచకులు, నిరాశ్రయులు, ఆకలితో ఉన్న వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి ట్రెజరర్ జంగాల ప్రభు కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ప్రతి నెల వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అవసరంలో ఉన్న వారికి చేయూత అందిస్తోందన్నారు. వాటిలో భాగంగా ప్రతి నెల చివరి ఆదివారం జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి మరియు పలు ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరింత మంది సేవాభావంతో ముందుకు వచ్చి ఇటువంటి మానవతా సేవా కార్యక్రమాలకు తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్బాబు, నితీష్, వేణుబాబు, శివ, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.