జిల్లాలో గ్రామపంచాయితీ కాంట్రాక్టు కార్మికులు, గ్రీన్ అంబాసిడర్స్ సుమారు 2000 మందికి పైగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశుధ్య పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర వహిస్తున్నారు.పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు, కుటుంబపోషణకు సరిపడా కనీసవేతనాలు ఇవ్వడంలేదు. నెలకు 6000 నుండి 12 వేలు ఇస్తుండగా గ్రీన్ అంబాసిడర్లు అందరికి అతి తక్కువగా 6000 మాత్రమే ఇస్తున్నారు.జిల్లాలో కలెక్టర్ గారు నిర్ణయించిన కనీసవేతనం రోజుకి 708 రూపాయలతో పాటు గ్రీన్ అంబాసిడర్లకు హెల్త్ అలవెన్స్ 4000 ఇవ్వాలన్న జీ. ఓ. యం. యస్. నెం. 75 ఎక్కడా అమలుకావడంలేదు.ఇస్తున్న కొద్దిపాటి వేతనాలు నెలల తరబడి బకాయిలు ఉంటున్నాయి. పి. యఫ్, ఇ. యస్. ఐ. సౌకర్యం లేదు. వారాంతపు సెలవుకాని,వేతనంతో కూడిన15 రోజులు సెలవులు, మట్టి ఖర్చులు ఏవి అమలుకు నోచుకోవడంలేదు.యూనిఫాం, సబ్బులు, చెప్పులు, నూనె, గ్లౌజ్, మాస్కులు సరఫరా చేయకపోవడంతో నిరంతరం అనారోగ్యానికి గురిఅవుతున్నారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదు.కార్మికులే స్వంతంగా వైధ్యఖర్చులు భరించాల్సిరావడంతో అప్పులపాలవుతున్నారు. కావున ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని యూనియన్ పిలుపుమేరకు జూలై 30 న కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నాము. కావున తమరు మాయందు దయవుంచి కార్మికులందరికి కనీసవేతనాలు ఇవ్వాలని, చట్టబద్ద సౌకర్యాలు కల్పించి న్యాయం చేయవల్సినదిగా కోరుతున్నాము.
డిమాండ్స్
1.గ్రామపంచాయితీ కాంట్రాక్టు కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి.
2.గ్రీన్ అంబాసిడర్స్ కి హెల్త్ అలవెన్స్ 4,000 అమలు చేయాలి.
3.వేతన బకాయిలు చెల్లించాలి.పంచాయితీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నెల,నెల వేతనాలు చెల్లించాలి.
4.పి.ఎఫ్ , ఇ.ఎస్.ఐ అమలు చేయాలి.
5.యూనిఫాం, చెప్పులు, నూనె, సబ్బులు , గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలి.
6.పనిలో ప్రమాధాలు జరిగితే వైద్య ఖర్చులు ప్రభుత్వమే చెల్లించి జీతం ఇవ్వాలి.
7.వారాంతపు సెలవు,వేతనంతో కూడిన 15 రోజులు సెలవులు, మట్టి ఖర్చులు ఇవ్వాలి.
ఇట్లు
తమవిధేయులు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *