తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.7,10,923 విలువైన LOCలను నలుగురు లబ్ధిదారులకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.సోమవారం దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు LOCలను అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితి మరియు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న సహాయాన్ని అవసరమైన వారికి చేరేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు