దర్శి మండలం పులిమివారిపల్లె, బట్టువారిపల్లి గ్రామాల్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొన్నారు.గ్రామస్తులు ఆత్మీయతకు ప్రతిరూపంగా సాదర స్వాగతం పలికారు. హారతులతో స్వాగతం పలుకుతూ, పూలదండలు వేసి, పూలవర్షంతో లక్ష్మీ దంపతులను తమ కుటుంబ ఆడబిడ్డలుగా ఆదరించారు. గ్రామస్తుల అపూర్వ ఆత్మీయత, అభిమానంతో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను ఆత్మీయంగా తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు, యూనిట్ & బూత్ ఇంచార్జ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, దర్శి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *