తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం,జరుగుమల్లి గ్రామంలోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో డి ఎం హెచ్ ఓ డిపార్ట్మెంట్ మరియు మత్స్యశాఖ సహకారంతో సార్డ్స్ – శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో మొత్తం 185 మంది శ్రింప్ పరిశ్రమ కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించారు. కార్మికులకు రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు అందించడంతో పాటు అలర్జీ, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు, జ్వరం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శ్రింప్ పరిశ్రమలో పనిచేసే మహిళా మరియు పురుష కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్మికులు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. కావ్య శ్రీ, జి.వి. ప్రసాదరావు, సూపర్వైజర్ చంద్రశేఖర్, మున్నంగి సీ ఫుడ్స్ హెచ్.ఆర్. దస్తగిరి, టెక్నికల్ ఆఫీసర్ రామారావు,శ్రీనాథ్, ఏ ఎన్ ఎం లు , ఆశా వర్కర్లు, శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ జెండర్ ఎక్స్‌పర్ట్ సంధ్య, డి పి ఎం.జి. మధుసూదన్‌రావు పాల్గొని శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.