తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,వై.పాలెం సీఐ గారి ఆధ్వర్యంలో, వై.పాలెం ఎస్‌ఐ గారు మరియు పుల్లలచెరువు ఎస్‌ఐ గారి బృందం సంయుక్తంగా యడ్రపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూదంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.