​కందుకూరు పట్టణం 6వ వార్డులోని కోట కట్ట ఈద్గా వద్ద చాలా కాలంగా మూలనపడి, పనిచేయకుండా ఉన్న బోరు బావిని పునరుద్ధరించి, ముస్లిం సోదరుల మంచినీటి కష్టాలను తీర్చిన శానససభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ముస్లిం మైనారిటీ సోదరులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు, ప్రతినిధులు మాట్లాడుతూ…​”ఈద్గా వద్ద బోరు చాలా కాలం నుంచి పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో ఎవరూ పట్టించుకోని ఈ సమస్యను ఇటీవల మా కూటమి/టీడీపీ ప్రభుత్వంలో మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకువెళ్లాం. సమస్యను విన్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, ‘కమిషనర్ మేడం గారిని కలవండి, నేను కూడా మాట్లాడి వెంటనే పని పూర్తయ్యేలా చూస్తాను’ అని భరోసా ఇచ్చారు.”​ఎమ్మెల్యే గారి ఆదేశాలు, సూచనలతో మున్సిపల్ కమిషనర్ మేడం గారు వెంటనే స్పందించి, ఆ బోరును పునరుద్ధరించి, మళ్లీ మంచినీరు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఉన్న నిబద్ధతకు, అధికారులు చూపిస్తున్న వేగవంతమైన స్పందనకు ఇది నిదర్శనమని ముస్లిం సోదరులు కొనియాడారు.​సమస్యను త్వరితగతిన పరిష్కరించి నీటి ఇబ్బందిని తీర్చినందుకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి, మున్సిపల్ కమిషనర్ మేడం గారికి, మున్సిపల్ సిబ్బందికి 6వ వార్డు ముస్లిం మైనారిటీ సోదరులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *