తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాలను ముందస్తుగా అరికట్టడం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమర్థవంతమైన నిఘా కొనసాగించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్ సెంటర్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాలు, నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు మరియు ఇతర ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు.అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, జూదం, బహిరంగంగా మద్యం సేవించడం వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, వృద్ధులు మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించిన సూచనలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.ఫుట్ పెట్రోలింగ్ ద్వారా నేరాలను నిరోధించడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావడం, నేరస్తుల్లో భయాన్ని కలిగించడం మరియు ప్రజల్లో భద్రతా విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరిస్తూ తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.