ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఈవ్ టీజింగ్ వంటి వేధింపులను అరికట్టడం లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు మరియు ప్రజలు అధికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడే వ్యక్తులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.మహిళలు, బాలికలు నిర్భయంగా విద్యాసంస్థలకు వెళ్లేందుకు, ప్రజా ప్రదేశాల్లో సురక్షితంగా సంచరించే వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు లేదా ఇతర అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *