ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు.సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్లు ఎవరికీ తెలియజేయరాదని సూచించారు. మహిళలపై నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. చట్టాలను పాటిస్తూ సురక్షితమైన, నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *