తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని దిగువమిట్ట గ్రామంలో నిర్వహిస్తున్న అక్రమ బెల్ట్ షాపుపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 180 మి.లీ. చొప్పున 11 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.