తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు ముండ్లమూరు మండలం, మారెళ్ల గ్రామంలో నిర్వహించిన “పల్లెనిద్ర” కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలతో మమేకమయ్యారు.గ్రామ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వారి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అదే విధంగా, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జ్ సుంకర రాఘవ రెడ్డి, మాజీ ఎంపీ మందలపు వెంకట్రామయ్య, మారెళ్ల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.