తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:-
జిల్లా నూతన ప్రజా రవాణా శాఖ అధికారిగా జి. వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన నెల్లూరు జిల్లా నుండి పదోన్నతి పై ఇక్కడకు బదిలీపై వచ్చారు.నూతన డిపిటివో బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు ను డిపో మేనేజర్ లావణ్య , ఫైనాన్స్ మేనేజర్ నేరెళ్ళ సత్యనారాయణ మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులు కలసి అభినందనలు తెలిపారు.