సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులు, అంగవైకల్యం కలిగిన వారు, అనాథలకు అండగా నిలుస్తూ న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యలు అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో, న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆగస్టు నెల కారుణ్య పరిచర్య కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు న్యూ లైఫ్ ఫౌండర్ ఎస్తేర్ ప్రభుదాస్ ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు, ప్రోత్సాహక సపోర్ట్ అందించారు. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు నిరంతరం చేయూతనందిస్తూ ఆశ్రయం, ఆదరణ, ఆత్మస్థైర్యం కల్పించడమే న్యూ లైఫ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో న్యూ లైఫ్ కారుణ్య పరిచర్య బృంద సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *