రోడ్డు ప్రమాదాల నివారణకు, అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల సంభవించే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే తీవ్ర ప్రభావం గురించి అవగాహన కల్పించారు.”మద్యం సేవిస్తే వాహనం నడపవద్దు – డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోండి లేదా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాన్ని వినియోగించండి” అని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *